తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గూఢచారి 2' వచ్చేస్తోంది.. అడవి శేష్​ క్లారిటీ - గూఢచారి

గూఢచారి 2 తో మళ్లీ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు హీరో అడవి శేష్​. గూఢచారి విడుదలై మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

gudachari 2
గూఢచారి 2

By

Published : Aug 4, 2021, 6:54 AM IST

'గూఢచారి'గా మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు అడివి శేష్‌. ఈనెలలోనే 'గూఢచారి 2'కి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకోనున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. శేష్‌ హీరోగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో తెరకెక్కి విజయవంతమైన చిత్రం 'గూఢచారి'

ఈ చిత్రం విడుదలై మంగళవారం నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్ర సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని చిత్ర బృందం పంచుకుంది. "గూఢచారి తెరపైకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. ఉత్తమమైనది ఇంకా రావాల్సి ఉంది. త్వరలో అతను మరో పెద్ద మిషన్‌తో తిరిగి రానున్నాడు. ఈనెలలోనే 'గూఢచారి 2' ప్రకటన వస్తుంది" అని అడివి శేష్‌ ట్వీట్‌ చేశారు. ఈ సీక్వెల్‌కి ఆయనే స్వయంగా స్క్రిప్ట్‌ అందించనున్నారు. తొలి చిత్రానికి శశికిరణ్‌ దర్శకుడిగా వ్యవహరించగా.. ఇప్పుడీ సీక్వెల్‌ను రాహుల్‌ పాకాల తెరకెక్కించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details