తెలంగాణ

telangana

By

Published : Apr 12, 2021, 4:13 PM IST

Updated : Apr 12, 2021, 4:28 PM IST

ETV Bharat / sitara

టీజర్​: సోల్జర్​గా​ ఎందుకు అవ్వాలనుకుంటారు?

యువ హీరో అడివి శేష్​ నటించిన 'మేజర్'​ చిత్ర టీజర్​ను తెలుగులో సూపర్​స్టార్​ మహేశ్​ బాబు సోమవారం విడుదల చేయగా.. హిందీలో సల్మాన్​ ఖాన్​, మలయాళంలో పృథ్వీరాజ్​ రిలీజ్​ చేశారు. ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

major
మేజర్​

యువ కథానాయకుడు అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'మేజర్‌'. పాన్​ ఇండియా స్థాయిలో సినిమానూ రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్​ను తెలుగులో సూపర్​స్టార్​ మహేశ్​బాబు, హిందీలో సల్మాన్​ ఖాన్​, మలయాళంలో పృథ్వీరాజ్​ విడుదల చేశారు. ఈ టీజర్​ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకక్కుతున్న 'మేజర్​' సినిమాకు శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ+ఎస్‌ మూవీస్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఇండో-చైనా సరిహద్దుతో పాటు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనూ చిత్రీకరణ జరుపుకొంటోంది.

ఇదీ చూడండి: ఆయన కళ్లు బాగా ఆకర్షించాయి.. అలా 'మేజర్' తీస్తున్నాం!

Last Updated : Apr 12, 2021, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details