తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో అవ్వడమే నా లక్ష్యం: శేష్ - adivi shesh

టాలీవుడ్ హీరో అడవి శేష్​. రెజీనా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఎవరు'. ఈ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సందర్భంగా శేష్​ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

సినిమా

By

Published : Jul 21, 2019, 6:39 AM IST

'క్షణం' సినిమా విడుదలకాక ముందు వరకూ నిర్మాతలందరూ తనని విలన్‌గానే చూశారు తప్ప, ఒక నటుడిగా చూడలేదనంటున్నాడు అడవి శేష్‌. రెజీనాతో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం 'ఎవరు'. వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ను నటి అక్కినేని సమంత విడుదల చేసింది. ఈ సందర్భంగా అడివి శేష్‌ మాట్లాడుతూ

"నన్ను హీరోగా నమ్మిన మొదటి నిర్మాత పీవీపీ గారు. ఆ సమయంలో మహేశ్‌, సామ్‌లకు నాపై ఉన్న నమ్మకంతో టీజర్‌ను విడుదల చేశారు. సమంత చేతి చలవతో నాకన్నీ శుభాలే జరిగాయి. ఆమె 'క్షణం', 'గూఢచారి' సినిమాల టీజర్స్‌ని విడుదల చేసింది. ఆ రెండూ విజయం సాధించాయి. ఇప్పుడు 'ఎవరు' టీజర్‌నూ విడుదల చేయడం ఆనందంగా ఉంది. నాకు సినిమా అంటే పిచ్చి. అంతకుమించి గౌరవం. 'ఎవరు' కథ బాగా నచ్చింది. రామ్‌జీ చెప్పిన వెంటనే ఒప్పుకొన్నా".

"‘మంచి సినిమాల్లో భాగస్వామిని కావడం నా కల. 'క్షణం' చేస్తున్నప్పుడు 'హీరో అవుదామని అనుకుంటున్నావా' అని అందరూ అడిగేవారు. హీరో కావడమే నా లక్ష్యం. ఈ సినిమా చేస్తున్నంత కాలం దర్శకుడు రామ్‌జీకి ఒకటే చెప్పా. 'నా కెరీర్‌లో ఇదే చివరి సీన్‌' అనుకుని తీయమన్నా. మనం వస్తాం.. ఉంటాం.. పోతాం.. కానీ మన సినిమాలు 50ఏళ్ల తర్వాత కూడా ఉంటాయి. అలాంటి చిత్రాల్లో ఇదొకటి. సాధారణంగా థ్రిలర్ల్‌లో ఏం జరుగుతుందో నేను చెప్పేయగలను. కానీ, ఈ సినిమా నా ఊహకు అందకుండా సాగింది. అదొక్కటే సంతోషం. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది".

"ఆగస్టు చివరి వారంలో 'ఎవరు' సినిమా విడుదల చేయాలని అనుకున్నాం. 'సాహో' వెనక్కి జరిగినందున ఆగస్టు 15న విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు. ఈ చిత్రం తర్వాత నేను 'మేజర్‌' సినిమా చేయబోతున్నాను".

ఇవీ చూడండి.. 'నిశ్శబ్ధం'గా ఉండమంటున్న అనుష్క చేతులు

ABOUT THE AUTHOR

...view details