ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ఈ కథ ప్రారంభంలో తెలుగు హీరో మహేశ్ బాబు, తమిళ హీరో విజయ్ను దర్శకుడు సంప్రదించారట. అయితే వాళ్లు ఆసక్తి చూపకపోవడం వల్ల మణిరత్నం ఆ ప్రయత్నం విరమించకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని ఆయన దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ధన శేఖరన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవలె మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా ఈ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ఆ సినిమాలో మహేశ్, విజయ్ నటించాల్సింది.. కానీ! - మహేశ్ , విజయ్ పొన్నియన్ సెల్వన్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ఈ చిత్రంలో రెండు పాత్రలకు మహేశ్ బాబు, విజయ్ దళపతిని సంప్రదించారని మణిరత్నం శిష్యుడు ధన శేఖరన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ కథపై వారిద్దరూ ఆసక్తి చూపకపోవడం వల్ల చిత్రబృందం వేరే నటులను ఎంపిక చేసినట్లు తెలిపారు.
కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే విదేశాల్లో షూటింగ్ పూర్తిచేసుకుంది. తమిళనాడు ప్రభుత్వ అనుమతులతో చిత్రబృందం మరో షెడ్యూల్ ప్రారంభించనుందట. ఐశ్వర్యరాయ్, విక్రమ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో జరగనున్న చిత్రీకరణకు ఇప్పటికే వీరిద్దరూ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, శోభితా దూలిపాళ్ల, అతిదిరావు హైదరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఇదీ చూడండి... షాపింగ్‌మాల్స్ తెరిచినా.. సినిమా హాళ్లు బంద్!