తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బుల్లితెరపై రాణించి వెండితెరపై అదరగొట్టి! - ప్రియా భవాని శంకర్

హీరోయిన్​గా రాణించాలనేది వారి కల. అందుకోసం అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నారు. తాము మెచ్చిన నటన కోసం బుల్లితెరను వేదికగా ఎంచుకున్నారు. తర్వాత దక్షిణాదిలో స్టార్ హీరోయిన్​ హోదా కోసం పోటీపడుతున్నారు. అలా బుల్లితెరపై అలరించి వెండితెరపై వెలుగొందుతోన్న కథానాయికలు ఎవరో చూద్దాం.

Actresses who started Acting career with small screen
బుల్లితెరపై రాణించి వెండితెరపై అదరగొట్టి

By

Published : Apr 16, 2021, 9:05 AM IST

సినిమాల్లో స్టార్ హీరోయిన్ హోదా అనేది ఊరికే రాదు. దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఎన్నో అవమానాలు, అసమానతలూ వెక్కిరిస్తాయి. వాటన్నింటినీ దాటుకునీ నిలబడాలంటే పట్టుదల, ఓర్పు, ధైర్యం ఉండాలి. అంతకుమించి ఎదగాలన్న కసి ఉండాలి. అందుకోసం అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాలి. అది బుల్లితెర అయినా, వెండితెర అయినా. అలా బుల్లితెరపై వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రస్తుతం స్టార్ హీరోయిన్​ స్టేటస్​ కోసం వడివడిగా అడుగులు వేస్తున్న కథానాయికలు ఎవరో చూద్దాం.

హన్సిక

15 ఏళ్ల వయసులోనే 'దేశముదురు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హన్సిక. తొలి సినిమాతోనే తనదైన నటనతో మెప్పించి అగ్రహీరోల సినిమాల్లో చోటు దక్కించుకుంది. అయితే ఈ నటి కెరీర్​ బుల్లితెరపైనే మొదలైంది. 'షకలక బూమ్ బూమ్' అనే సీరియల్​తో తన కెరీర్​ను ప్రారంభించిందీ ముద్దుగుమ్మ.

హన్సిక

ఐశ్వర్యా రాజేశ్

దక్షిణాదిలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఐశ్వర్యా రాజేశ్. 2012లో విడుదలైన 'అట్టకత్తి' అనే చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఐశ్వర్య ముందుగా 'అసంత పొవత్తు యారు' అనే కామెడీ షోకు యాంకర్​గా వ్యవహరించింది. ఆ తర్వాత 'మానాడ మాయిలాడా' అనే రియాలిటీ షోలో తన డ్యాన్స్​తో అలరించింది. ప్రస్తుతం హీరోయిన్​గా వరుస ఆఫర్లు అందుకుంటోంది.

ఐశ్వర్యా రాజేశ్

వాణీ భోజన్

వాణీ భోజన్ మొదట ఎయిర్​ హోస్టస్​గా పనిచేసింది. తర్వాత ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ సమయంలోనే 'దేవమాగల్'​ అనే సూపర్ హిట్​ సీరియల్​లో లీడ్​ రోల్ పోషించే​ అవకాశం దక్కించుకుంది. ఈ సీరియల్ సన్​ టీవీలో దాదాపు ఐదేళ్ల పాటు ప్రసారమైంది. ఆ తర్వాత తమిళ చిత్రం 'ఓ మై కడవులే'తో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ మూవీ ఘనవిజయం సాధించడం వల్ల వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.

వాణీ భోజన్

నివేదా థామస్

ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్​సాబ్' చిత్రంలో వేముల పల్లవి అనే క్యారెక్టర్​లో నటించి గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న పాత్రలతో మెప్పిస్తోన్న ఈ ముద్దుగుమ్మ మొదట ఓ తమిళ సీరియల్​లో నటించింది. 'మై డియర్ భూతమ్' అనే ధారావాహికలో బాలనటి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత 'వెరుతే ఒరు భార్య'లో జయరాం కూతురుగా మెప్పించింది. అనంతరం 'కురువి', 'పొరాలీ' అనే తమిళ చిత్రాల్లో సహ నటిగా కనిపించింది.

నివేదా థామస్

ప్రియా భవాని శంకర్

ఈ నటి మొదట న్యూస్​ రీడర్​గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. విజయ్ టీవీలో వచ్చిన 'కల్యాణం ముదల్ కాదల్ వరై' అనే సీరియల్​ ద్వారా పాపులర్ అయింది. తర్వాత వైభవ్ హీరోగా నటించిన 'మెయాదా మాన్' చిత్రంలో హీరోయిన్​గా వెండితెర అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆరు చిత్రాలతో బిజీగా ఉంది. ఇందులో కమల్ హాసన్​ హీరోగా నటిస్తోన్న 'ఇండియన్ 2' కూడా ఉంది.
ప్రియా భవాని

ఇవీ చూడండి:

గ్లామర్​ డోస్​ పెంచేసిన బుల్లితెర యాంకర్

వకీల్‌సాబ్‌.. పవన్‌ను హత్తుకున్న తారక్‌!

ABOUT THE AUTHOR

...view details