తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నేను రెండోపెళ్లి చేసుకోవట్లేదు: సురేఖ వాణి - surekha vani second marriage

రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు నటి సురేఖ వాణి. గత కొన్నిరోజులుగా.. ఆమె మరోసారి వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Actresses Surekha Vani
సురేఖ వాణి

By

Published : Feb 21, 2021, 8:00 PM IST

Updated : Feb 21, 2021, 8:08 PM IST

మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టే ఆలోచన తనకు లేదని నటి సురేఖ వాణి స్పష్టం చేశారు. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సురేఖ తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా, సురేఖ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కుమార్తె సుప్రీత నిర్ణయం ప్రకారమే సురేఖ మరోసారి ఏడడుగుల వైపు మొగ్గు చూపుతున్నారని నెట్టింట్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన పెళ్లి వార్తల గురించి నటి సురేఖ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని.. తాను రెండో వివాహం చేసుకోవడం లేదని చెప్పారు. దాదాపు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో సురేఖ భర్త కన్నుమూశారు. 'భద్ర', 'దుబాయ్‌ శీను', 'బృందావనం', 'శ్రీమంతుడు', 'బొమ్మరిల్లు' చిత్రాలు సురేఖకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఇదీ చూడండి: 2022లో షారుక్​ 'పఠాన్'​.. జాన్​ 'అటాక్'​ రిలీజ్​ ఖరారు

Last Updated : Feb 21, 2021, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details