సినీ ప్రముఖుల్లో చాలా మందికి వ్యవసాయం అంటే మక్కువ. వారు స్వయంగా పంటలు పండిస్తుంటారు. తమ పొలాల్లో పండిన పంటల్ని అప్పుడప్పుడు తోటి తారలకు, సన్నిహితులకు బహుమతిగా అందజేస్తుంటారు.
పవన్ కల్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో పండిన మామిడిపళ్లను సినీ ప్రముఖులకు పంపుతుంటారు. అలా కథానాయిక పూజాహెగ్డే కొద్దిమంది తారలకు సహజ సిద్ధంగా పండించిన మామిడిపళ్లను పంపించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పలువురికి నోరు తీపి చేసింది.