ఫిట్నెస్.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందరూ దీని గురించి ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు. కానీ సెలిబ్రిటీలు, క్రీడాకారులు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఈ మధ్య పురుషులు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్‌పై దృష్టిసారిస్తే, మహిళలు జీరోసైజ్తో నాజూగ్గా కనిపించడానికి మక్కువ చూపుతున్నారు. యుక్త వయసులో ఉన్న వారు ఈ ట్రెండ్‌ను ఎక్కువగా అనుసరిస్తారు. కానీ కొంతమంది హీరోయిన్లు 40 ఏళ్లు దాటినా వారి అదిరిపోయే ఫిట్నెస్తో ఆకట్టుకుంటున్నారు. వారెవరో చూద్దాం.
మలైకా అరోరా
ఫిట్నెస్, ఫ్యాషన్ విషయంలో అందరికంటే ముందుంటుంది మలైకా అరోరా. 46 ఏళ్ల ఈ సీనియర్ నటి 'దివా యోగా' అనే సెంటర్‌ను నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియాలతో ఫిట్నెస్ పాఠాలు చెబుతోంది.
శిల్పాశెట్టి
బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ ఓ వెలుగు వెలిగిన తార శిల్పాశెట్టి. ప్రస్తుతం బిజినెస్ చూసుకుంటోంది. అలాగే తన జీవితంలో ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెబుతోంది. అందుకే ఇంట్లోనే పూర్తిస్థాయి జిమ్‌ను ఏర్పాటు చేసుకుంది. జిమ్‌తో పాటు 40 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే యోగాసనాలతో అలరిస్తోంది. నెటిజన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
కరిష్మా కపూర్