కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న కథానాయకుడు. ప్రస్తుతం హెచ్. వినోథ్ దర్శకత్వంలో 'వాలిమై' చిత్రంలో అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో కథానాయికగా ఇలియానా కనిపించనుందని సినీ వర్గాల సమాచారం. మరోవైపు యామి గౌతమ్ నటించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా నయనతార, నజ్రియాలు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్ని ఎంత వరకు నిజమే తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
అజిత్ జోడీగా ఇలియానా- యామి గౌతమ్? - తెలుగు తాజా సినిమా వార్తలు
ప్రముఖ హీరో అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వాలిమై'. ఈ సినిమాలో అజిత్ సరసన ఇలియానా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు యామి గౌతమ్‌ను కూడా చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం.
![అజిత్ జోడీగా ఇలియానా- యామి గౌతమ్? ACTRESSES ILIYANA AND YAMI GOUTHAM HAVE A CHANCE TO ACT WITH HERO AJITH KUMAR IN HIS MOVIE VALIMAI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5368677-83-5368677-1576312509692.jpg)
అజిత్ జోడీగా ఇలియానా- యామి గౌతమ్?
ఈ చిత్రంలో అజిత్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించనున్నారట. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: అంచనాలను పెంచుతున్న వర్మ 'డ్రాగన్' ట్రైలర్