తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎన్టీఆర్​తో ఒక్క సీన్​ అయినా చేస్తే చాలు!' - ఆలీతో సరదాగా లేటెస్ట్​ ఎపిసోడ్​ ప్రోమో

'దేవి' సినిమాతో నటిగా మంచి గుర్తింపు పొందిన వనితా విజయ్​కుమార్​.. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. నటిగా తన కెరీర్​లో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలను వివరిస్తూ.. ఒకానొక సమయంలో చావు దాకా వచ్చి బతికినట్లు ఆమె వెల్లడించారు.

Actress Vanitha Vijayakumar interview in Alitho Saradaga episode promo
'ఎన్టీఆర్​తో ఒక్క షాట్​లో నటిస్తే చాలు!'

By

Published : Aug 10, 2021, 9:25 PM IST

ప్రముఖ నటి మంజుల, విజయ్​కుమార్​ దంపతుల వారసురాలిగా చిత్రసీమకు పరిచయమైన వనితా విజయ్​ కుమార్​.. 'దేవి' సినిమాతో టాలీవుడ్​లో అడుగుపెట్టారు. నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తొలి సినిమాతోనే మంచి ఆదరణ దక్కించుకున్నారు. అయితే ఆమె తెలుగులో నటించిన తొలి, మలి చిత్రం అదే. ఇదే విషయమై 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వ్యాఖ్యాత అలీ ప్రశ్నించగా.. ఆ సమయంలో మెదడు సరిగా పనిచేయకపోవడం వల్ల తెలుగు సినిమాల్లో నటించలేదని ఆమె స్పష్టం చేశారు.

తొలి సినిమా(దేవి) తర్వాత తెలుగులో అనేక అవకాశాలు వచ్చినా.. ప్రేమ కారణంగా అందులో నటించలేక పోయానని వనితా విజయ్​కుమార్​ ఈ సందర్భంగా వెల్లడించారు. కానీ, కచ్చితంగా ఏదో ఒకరోజు మళ్లీ ఇక్కడికి(టాలీవుడ్​) వస్తానని నమ్మకం ఉందని ఆమె అన్నారు.

ఎన్టీఆర్​కు పెద్ద​ ఫ్యాన్​

టాలీవుడ్​లో అప్పట్లో నాగార్జున.. ఇప్పుడు జూనియర్​ ఎన్టీఆర్​ అంటే తనకు ఎంతో అభిమానమని వనిత చెప్పారు.​ ఎన్టీఆర్​తో కలిసి ఒక్క సన్నివేశంలోనైనా నటించాలనేది తన డ్రీమ్ అని తన మనసులో మాట బయటపెట్టారు.

నిజమైన పాముతో షూటింగ్​

'దేవి' షూటింగ్​లో నిజమైన పాము తన నుదుటన బొట్టు పెట్టిందని వనిత వెల్లడించారు. అయితే అలా బొట్టు పెట్టే క్రమంలో పాము తన వేలిని కొరికిందని, చావు బతుకుల పరిస్థితి వచ్చిందని ఆమె తెలిపారు. ఆ పరిస్థితిలో తాను చనిపోయినా పర్లేదని.. తన తల్లి భావించినట్లు వనిత స్పష్టం చేశారు.

ఇదీ చూడండి..'క్లాప్ బోర్డు కిందపెట్టినందుకు ఆయన కొట్టారు'

ABOUT THE AUTHOR

...view details