బాలీవుడ్ సుందరి ఊర్వశి రౌతేలా టాలీవుడ్ అరంగేట్రంలోనే భారీ ఆఫర్లు కొట్టేసినట్లు కనిపిస్తోంది. 'రెడ్ రోజ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు ఆమె ఇప్పటికే సిద్ధమైంది. తన మొదటి చిత్రం విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వరుస కడుతున్నాయట. ఆ మధ్య 'పుష్ప'లో ఐటమ్ సాంగ్ చేస్తుందనుకున్న దిశాపటానీ ఏవో కారణాలతో తప్పుకుంది. దాంతో ఊర్వశికి స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌తో స్టెప్పేసే అవకాశం వచ్చింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లోని మరో సినిమాలోనూ ఐటమ్ సాంగ్ చేసేందుకు ఊర్వశి రౌతేలా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా వస్తున్న 'సర్కారువారి పాట'లో ఊర్వశి ఐటమ్‌గర్ల్‌గా ఉర్రూతలూగించనుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే.. దీనికి సంబంధించి ఎలాంటి అధికారికా ప్రకటనా రాలేదు.