టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్స్‌లో త్రిష ఒకరు. రెండు దశాబ్దాల నుంచి తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తాను ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారో తెలిపారు.
"నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అలాంటి వ్యక్తి దొరికేవరకు ఎదురుచూస్తుంటాను. అప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించను. నేను కోరుకున్న వ్యక్తి దొరకకపోతే జీవితాంతం ఒంటరిగా ఉండటానికైనా సిద్ధమే. తోడు దొరకలేదని అస్సలు బాధపడను."