కోలీవుడ్‌లో గతేడాది విడుదలైన '96' సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో నటించిన హీరయిన్ త్రిష కెరీర్ మళ్లీ ఊపందుకోవడంలో సహాయపడింది. ఈ చిత్రం తర్వాత ఆమె వరుసగా పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన రజనీకాంత్ 'పేట'లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు మరో మెగా ప్రాజెక్టు కోసం ఎంపికైందని టాక్.
మరో మెగా ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన త్రిష! - CHIRU 152
మలయాళ ప్రముఖ హీరో మోహన్‌లాల్ పక్కన హీరోయిన్గా త్రిష అవకాశం కొట్టేసిందట. ఈ సినిమాకు 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
హీరోయిన్ త్రిష
మలయాళ స్టార్ హీరో మెహన్‌లాల్- దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో కథానాయికగా నటించనుందట త్రిష. ఈ మేరకు చిత్రబృందం ఆమెతో చర్చలు జరుపుతోందట. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా 'రంగీ'లో నటిస్తోంది త్రిష. శరవనన్ దర్శకత్వం వహించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.