కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించకపోవడం వల్ల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగులు మొదలుపెట్టారు. కొందరు తారలూ ధైర్యంగా సెట్లోకి అడుగుపెడుతున్నారు. కథానాయిక తాప్సి అంతే ధైర్యంగా తను నటిస్తున్న తమిళ చిత్రం 'అన్నాబెల్లె' చిత్రీకరణలో పాల్గొంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
'అది వైరస్ మాత్రమే.. డైనోసార్ కాదు కదా!' - తాప్సీ వార్తలు
కరోనా వైరస్ వ్యాపిస్తున్నా చిత్రీకరణలో పాల్గొనాల్సిందేనని అంటోంది నటి తాప్సి. ప్రస్తుత పరిస్థితిలో మంచి ఆహారపు అలవాట్లు, తగిన జాగ్రత్తలు పాటించడం మంచిదని ఆమె సూచించింది.
ఈ నేపథ్యంలో తాప్సి స్పందిస్తూ.. "ఎక్కడో ఓ చోట, ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాల్సిందే కదా అనుకుంటూ సెట్‌కు వెళ్లడానికి ముందే మన మైండ్‌ను సిద్ధం చేసుకోవాలి. తలుపులన్నీ మూసేసుకుని ఇంట్లో కూర్చోవడానికి అది వైరస్ మాత్రమే.. డైనోసార్ కాదు. మంచి ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడమే మనం చేయాల్సిన పని. అతి తక్కువమంది టీమ్‌తో మా 'అన్నాబెల్లె' చిత్రీకరణను పూర్తి చేశాం. ఈ నెల్లోనే 'హసీనా దిల్‌రుబా'ని పూర్తి చేసి, తర్వాత 'రష్మీ రాకెట్', 'లూప్ లపేటా' చిత్రీకరణలో పాల్గొనాలి" అని చెప్పింది.