తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తుపాకి' సీక్వెల్​లో తమన్నా.. 10 ఏళ్లకు ఆ ఛాన్స్​? - Thuppaki Sequel

మిల్కీబ్యూటీ తమన్నా.. తమిళ స్టార్​ హీరో విజయ్​ సరసన మరోసారి నటించే ఛాన్స్ కొట్టేసిందట. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్​లో బాగా ప్రచారం జరుగుతోంది. మురుగదాస్​ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'తుపాకి' సీక్వెల్​లో హీరోయిన్​గా తమన్నా ఎంపికైందని సమాచారం. ఇదే నిజమైతే దాదాపు పదేళ్ల తర్వాత విజయ్​-తమన్నాలు కలిసి నటిస్తున్న సినిమా ఇదే అవుతుంది.

Actress Tamannah has been selected as the heroine in the 'Thuppaki' sequel
'తుపాకి' సీక్వెల్​లో హీరోయిన్​గా మిల్కీబ్యూటీ!

By

Published : Sep 1, 2020, 10:22 AM IST

తమిళ స్టార్​ హీరో విజయ్​, దర్శకుడు మురుగదాస్​ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం 'తుపాకి'. తమిళ, తెలుగు భాషల్లో విడుదలై.. బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్​ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో విజయ్​ సరసన మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్​గా ఎంచుకున్నట్లు సమాచారం.

తమన్నా, విజయ్​

విజయ్​-తమన్నాలు కలిసి ఎస్పీ రాజ్​కుమార్​ దర్శకత్వంలో నటించిన 'సుర' చిత్రం 2010లో విడుదలైంది. దాదాపు పదేళ్ల తర్వాత మురుగదాస్​ చిత్రం కోసం వీరిద్దరూ మళ్లీ కలిసి నటించనున్నారని కోలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. విజయ్​ ప్రస్తుతం 'మాస్టర్'​ చిత్రంతో బిజీగా ఉండగా.. సంపత్​ నంది తెరకెక్కిస్తున్న 'సీటీమార్'​లో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి​గా నటిస్తోంది తమన్నా.

ABOUT THE AUTHOR

...view details