తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీనటి తమన్నా ఇంట్లో కరోనా కలకలం

అగ్రనటి తమన్నా భాటియా కుటుంబం కరోనా బారిన పడింది. ఈ అందాల భామ క్షేమంగా ఉన్నప్పటికీ.. తన తల్లిదండ్రులకు మాత్రం వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు వెల్లడించింది.

actress tamannaah parents test positive in covid-19 test
సినీనటి తమన్నా భాటియా ఇంట్లో కరోనా కలకలం

By

Published : Aug 26, 2020, 3:40 PM IST

సినీ నటి తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమాల ద్వారా తమన్నా స్వయంగా వెల్లడించింది. ఈ వారంలో తన తల్లిదండ్రుల్లో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించాయని.. దీంతో ఇంట్లో ఉన్న అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది.

ఇంట్లో అందరూ కొవిడ్-19 పరీక్షలు చేయించుకోగా... రిపోర్టుల్లో తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు తెలిపింది. తనతో పాటు ఇతర కుటుంబసభ్యులకు నెగెటివ్ వచ్చిందని ఆ పోస్టులో పేర్కొంది. అందరి ప్రేమాభిమానాలతో వారు త్వరగా కోలుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది తమన్నా.

ABOUT THE AUTHOR

...view details