పర్యాటకులకు భూతల స్వర్గంగా పేరు పొందిన మాల్దీవుల్లో నటి తాప్సీ ఎంజాయ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితమైన ఆమె ఇటీవల తన సోదరీమణులతో కలిసి మాల్దీవులకు విహారానికి వెళ్లారు. ఈ నెల ఆరో తేదీన అక్కడికి చేరుకున్న తాప్సీ.. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫొటోని షేర్ చేశారు. 'కొన్నిరోజులపాటు ఇదే నా నివాసం' అని పేర్కొన్నారు.
విహారయాత్రలో నటి తాప్సీ.. ఫొటోలు వైరల్ - tapsee bikini news
లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు ఇంటికే పరిమితమైన నటి తాప్సీ.. తాజాగా హాలీడే ట్రిప్‌కు వెళ్లారు. భూతల స్వర్గంగా పేరొందిన మాల్దీవుల్లో తన సోదరీమణులతో కలిసి ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. వీటిని చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.
టూర్‌లో భాగంగా తాప్సీ సిస్టర్స్ బీచ్‌లోని ఇసుకలో సరదాగా ఆటలాడుకుంటూ పోటీ పెట్టుకున్నారు. స్క్యూబా డైవింగ్‌లో పాల్గొన్నానని తెలిపారు. అనంతరం బీచ్‌లో దిగిన పలు ఫొటోలను షేర్ చేస్తూ.. సాయం సంధ్యా సమయం తనకెంతో ఇష్టమని.. ప్రకృతి మనకి మంచి లైటింగ్, అందమైన బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చినప్పుడు మనం వాటిని చెడగొట్టకుండా ఉంటే చాలని ఆమె పేర్కొన్నారు.
పూల్‌లో నిల్చుని ఫుడ్ తింటున్న ఓ ఫొటో షేర్ చేసిన తాప్సీ.. న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు తాను ఈ హలీడేలో మష్రూమ్స్, ఎగ్స్, అవకాడోతో కూడిన ఫుడ్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు మాల్దీవుల టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టా వేదికగా ఆమె పోస్ట్ చేస్తున్నారు.