తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అన్ని భాషల నటిని.. ఆశ కూడా ఎక్కువే' - శ్రుతి హాసన్ సినిమా వార్తలు

తాను అన్ని భాషలకు చెందిన నటినని, ప్రస్తుతం హిందీ చేయనంత మాత్రన వేరుగా మాట్లాడటం సరికాదని శ్రుతి హాసన్ చెప్పింది.

actress sruthi hassan about her greedy
నటి శ్రుతి హాసన్

By

Published : Sep 9, 2020, 7:00 AM IST

దక్షిణాది అందం శ్రుతిహాసన్‌.. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ఈ మధ్య ఆమె అక్కడ సినిమాలేవీ చేయడం లేదు. దాంతో ఆమెకు అవకాశాలు లేవు అనుకున్నారట. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆమె చెవిని పడింది.

"నేను దక్షిణాది నుంచే వచ్చాను. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. హిందీలోనూ చేశాను. శ్రుతి దక్షిణాదికే పరిమితమైంది. హిందీపై ఆమెకు ఆసక్తి లేదని కొందరన్నారట. నేను అన్ని భాషల నటిని. అలా కొనసాగడం మన దేశంలోనే కుదురుతుంది. ప్రస్తుతానికి బాలీవుడ్​లో నటించనంత మాత్రాన అవకాశాలు లేవని కాదు... హిందీ సినిమాల్ని వదిలేసినట్టూ కాదు. వేరే భాషల్లో నటిస్తున్నా అంతే" అని చెప్పింది శ్రుతి.

జీవితంలో అన్ని విషయాలను నేర్చుకుంటూ నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నాను చెబుతోంది శ్రుతి. "నాకు ఏదైనా ఎక్కువ కావాలనిపిస్తుంది. నాకు బాగా ఆశ ఎక్కువ. ఇంకా ఏదో కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటాను.మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాల పరంగా నన్ను నేను మరింత తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా" అని అంటోంది.

ABOUT THE AUTHOR

...view details