తన నటనతో పాటు అందంతో ప్రేక్షకుల హదయాలను గెలుచుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్. ఈ ముద్దుగుమ్మ నటిగా తన కెరీర్లో 11 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల ప్రయాణంలో అన్నింటికంటే కూడా నేర్చుకోవడమే ఎక్కువ సంతృప్తినిచ్చిందని చెబుతోంది.
మొదట్లో ఆ విషయంలో ఇబ్బంది పడ్డా: శ్రుతి - sruthi hasan news
సినీ పరిశ్రమలో 11 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో తన అనుభవాలను పంచుకుంది.
"మనం నేర్చుకున్నదంతా పరోక్షంగా మన పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే నేను బాగా పనిచేశానని చెప్పడం కంటే కూడా బాగా నేర్చుకోవడంపై దృష్టిపెట్టానని, దాన్నే ఎక్కువగా ఆస్వాదించానని చెబుతా. ఆరంభంలో నేనెలాంటి పాత్రలు చేయాలనే విషయంలో చాలా ఇబ్బంది పడ్డా. కానీ ఆ దశని కూడా ఎంజాయ్ చేశాను కానీ, ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గాలని నిర్ణయించుకుని మరో మార్గంలో ప్రయాణించా. ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్నా" అని తెలిపింది శ్రుతి.
ప్రస్తుతం శ్రుతి హాసన్ తెలుగులో పవన్ సరసన 'వకీల్ సాబ్'లో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో 'యారా'లో కథానాయికగా నటించింది. ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. శ్రుతిహాసన్‌తో పాటు విద్యుత్ జమ్వాల్, విజయ్‌వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తిగ్మన్షు దులియా స్వీయ దర్శకత్వం వహించాడు. ఫ్రెంచ్ చిత్రం 'ఎ గ్యాంగ్ స్టోరీ'కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు.