తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజినీకాంత్​కు తల్లిగా శ్రీదేవి నటించిన వేళ! - latest sree devi movie news

అతిలోకసుందరి శ్రీదేవి.. సూపర్​స్టార్​ రజినీకాంత్​కు ఓ సినిమాలో తల్లిగా నటించారట. అదీ ఆమెకు 13 ఏళ్ల వయసున్నప్పుడు. ఇంతకీ ఆ చిత్రమేమిటంటే?

superstar rajnikanth, sree devi
సూపర్​స్టార్​ రజనీకి తల్లిగా శ్రీదేవి

By

Published : Jun 12, 2020, 9:36 AM IST

తన నటన, అభినయంతో మెప్పించి, అందంతో మైమరిపించిన అతిలోకసుందరి శ్రీదేవి. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. దిగ్గజ ఎన్టీఆర్​, ఏఎన్నార్​, చిరంజీవి తదితర అగ్ర కథానాయకుల సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్​స్టార్​ రజినీకాంత్​తోనూ పలు చిత్రాల్లో కనిపించి.. హిట్​పెయిర్​గా పేరుతెచ్చుకున్నారు. అయితే ఓ సినిమాలో రజినీకి తల్లిగా ఈమె నటించారంటే నమ్మగలరా? అది 13 ఏళ్ల వయసున్నప్పుడు ఈ పాత్ర చేశారు.

రజనీకాంత్​, శ్రీదేవి

ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్​ తీసిన 'మూండ్రు ముడిచ్చు' సినిమాలో రజినీ, శ్రీదేవి.. సవతి తల్లి, కుమారుడుగా నటించారు. కథలో భాగంగా దురుద్దేశంతో తన ప్రియుడిని, తనకు కాకుండా చేసినందుకు రజినీపై పగ తీర్చుకునేందుకు అతడి తండ్రిని వివాహం చేసుకొని, సవతిగా మారుతుంది. కానీ దీని తర్వాత చాలా చిత్రాల్లో రజనీ, శ్రీదేవి జోడీగా తెరపై కనువిందు చేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details