ఎవరో పెట్టిన పోస్టు వల్ల చాలామంది నుంచి తనకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని నటి షకీలా తెలిపారు. షకీలా కన్నుమూసిందంటూ కొన్నిరోజుల నుంచి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనారోగ్య సమస్యలతో ఆమె తుదిశ్వాస విడించిందని పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై నటి షకీలా తాజాగా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు.
నేను బతికే ఉన్నా.. ఆరోగ్యంగా ఉన్నా: షకీలా - షకీలా డెత్ న్యూస్
ఎవరో పెట్టిన పోస్టు వల్ల వరుస ఫోన్ కాల్స్ వచ్చాయని నటి షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగా లేనంటూ, చనిపోయానంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు పుకార్లే అని స్పష్టం చేశారు.
షకీలా, షకీలా ఫొటో
"నేను మృతిచెందానంటూ పలు సోషల్‌మీడియా ఖాతాల్లో వస్తోన్న పోస్టులు చూశా. అవన్నీ పుకార్లు మాత్రమే. నేను ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నా. ఎవరో ఇలాంటి పుకార్లు సృష్టించడం వల్ల నాకు వరుసపెట్టి ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. నా క్షేమసమాచారాలు అడిగి తెలుసుకుంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు" అని షకీలా పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'పదేళ్లు ప్రేమించా.. కానీ అతడు చేసిన పని..'