హీరోయిన్ సమంత (Tollywood Heroine Samantha)తిరుమల శ్రీవారిని (Tirumala Srivari) దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరిన నటి... శ్రీవారి మూలమూర్తిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో సినీనటి సమంత తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినిమా టిక్కెట్లు ఆన్ లైన్లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే జగన్ దీనిని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
సమంత కెరీర్..
స్టార్ హీరోయిన్ సమంత(samantha movie list 2021) విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకెళ్తోంది. ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్'తో(samantha family man look) హిందీ ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ కథలను వినడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందని ప్రచారం సాగింది! ఇకపై తెలుగులో సామ్ నటించదని అంతా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు తెలుగులోనే ఓ కొత్త దర్శకుడికి సామ్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర టైటిల్ సహా మిగతా నటీనటుల వివరాలతో ఈ మూవీ గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. త్వరలోనే సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం'(samantha shakuntalam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకేతో మరో సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. నాగచైతన్య- సమంత విడిపోతున్నారనే వార్తలకు సైతం ఇటీవలె చెక్ పెట్టింది. చైతు సినిమా లవ్‌స్టోరి ట్రైలర్‌ను షేర్ చేసి రూమర్లకు బ్రేక్ ఇచ్చింది.
ఇదీ చదవండి:కొత్త దర్శకుడికి సమంత గ్రీన్‌సిగ్నల్!