స్నేహితులతో కలిసి తీర్థయాత్రలో ఉన్న హీరోయిన్ సమంత(Samantha Latest News).. శుక్రవారం హెలీకాప్టర్‌లో కేదార్నాథ్ చేరుకుంది. అనంతరం బద్రీనాథ్ ధామ్‌ను దర్శించుకుంది.
విడాకుల అనంతరం సమంత (Samantha Akkineni News) చేపట్టిన తీర్థయాత్ర ఇది. ఆమె తన ఆరుగురు స్నేహితులతో గురువారమే ఉత్తరాఖండ్ వెళ్లింది. ఆరోజు గంగోత్రిని దర్శించుకుని, రాత్రికి హర్షిల్‌లోని హోటల్లో ఉన్నారు. శుక్రవారం కేదార్, బద్రీలను సందర్శించారు. సాయంత్రానికి దేహ్రాదూన్ వెళ్లిపోయారు.
ఇటీవలే విడిపోయిన చై-సామ్..
ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత.. ఇటీవలే తమ బంధానికి ముగింపు (Chaysam Divorce) పలికారు. భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. పదేళ్లుగా తమ స్నేహం కొనసాగినందుకు అదృష్టవంతులమని పేర్కొన్నారు. ఆ స్నేహమే తమ వివాహ బంధానికి కీలకంగా నిలిచిందని అన్నారు.
అయితే విడిపోడానికి సరైన కారణాన్ని వెల్లడించని చైతూ-సామ్.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో తమ స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారు.
ఇదీ చూడండి:Samantha Defamation Suit updates: సమంత పరువు నష్టం పిటిషన్‌పై కోర్టులో ఇవాళ ఏం జరిగిందంటే..