తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మీరు మారరా?'.. నెటిజన్​ కామెంట్​కు సమంత స్ట్రాంగ్​ కౌంటర్ - సమంత

Samantha: తన డ్రెస్‌పై నెగెటివ్‌ కామెంట్స్‌ చేసిన ఓ నెటిజన్​పై మండిపడ్డారు నటి సమంత. ఇప్పటికైనా కాస్త ఆలోచనా విధానం మార్చుకోవాలని అన్నారు.

samantha
సమంత

By

Published : Mar 13, 2022, 5:19 PM IST

Updated : Mar 14, 2022, 11:51 AM IST

Samantha: తన డ్రెస్సింగ్​పై వస్తున్న ట్రోల్స్​కు గట్టిగా సమాధానమిచ్చారు అగ్రకథానాయిక సమంత. 'క్రిటిక్స్‌ ఛాయిస్‌' అవార్డుల ప్రదానోత్సవం నిమిత్తం ఆమె ఇటీవల ముంబయిలో తళుక్కున మెరిశారు. సుమారు రూ.2లక్షల ఖరీదు చేసే గ్రీన్‌ కలర్‌ లాంగ్‌ వెస్ట్రన్‌ ఫ్రాక్‌తో ఈ షోలో ఆమె సందడి చేశారు.

సమంత

ఆ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు సామ్. వాటిని చూసిన నెటిజన్లు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. విడాకుల అనంతరం సామ్‌ కొత్తగా ప్రవర్తిస్తున్నారని.. ఆమె వస్త్రాధారణలో మార్పులు వచ్చాయంటూ నెగెటివ్‌ కామెంట్స్‌ చేయడం ప్రారంభించారు. ఆ ట్రోల్స్‌కు సమంత గట్టిగా బదులిచ్చారు.

సమంత పోస్ట్​

"ఎదుటివారిపై ఓ అభిప్రాయానికి రావాలంటే.. ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలో ఒక మహిళగా నాకంటూ అవగాహన ఉంది. కానీ, ఇప్పుడు మనం.. దుస్తులు, శరీరపు ఛాయ, చదువు.. ఇలా ఎన్నో అంశాలను ఆధారంగా చేసుకుని మహిళలపై ఓ నిర్ణయానికి వస్తున్నాం. ఒక మనిషి ధరించిన దుస్తుల్ని బట్టి వారిని జడ్జ్‌ చేయడం ఎంతో తేలిక. ప్రస్తుతం మనం 2022లో ఉన్నాం. మహిళలు ధరించిన దుస్తుల్ని బట్టి వాళ్ల క్యారెక్టర్‌ని నిర్ణయించడం ఇకనైనా మానుకోవాలి. మన వ్యక్తిగత అభిప్రాయాలను వేరొకరి మీద రుద్దడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదు" అని సమంత రాసుకొచ్చారు.

సామ్

ఇదీ చూడండి:అవార్డ్స్​ ఫంక్షన్​లో సమంత బోల్డ్​ షో!

Last Updated : Mar 14, 2022, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details