తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మా ఇద్దరిని వేరు చేసేదదే: సమంత - feet up with stars

టాలీవుడ్​లో అందమైన ప్రేమ జంట నాగచైతన్య-సమంత. 'ఏమాయ చేసావె' చిత్రీకరణలో ప్రేమలో పడిన వీరిద్దరూ.. ఆ తర్వాత కొన్నేళ్లకు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం తర్వాత ఇద్దరి మధ్యలో వచ్చిన మార్పు గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసింది సామ్​.

చైతన్య, నన్ను వేరుచేసింది అదొక్కటే: సమంత

By

Published : Sep 22, 2019, 7:13 PM IST

Updated : Oct 1, 2019, 2:59 PM IST

'ఏమాయ చేసావె' చిత్రంతో ప్రేమలో పడిన నాగచైతన్య-సమంత... కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇటీవలే 'మజిలీ' చిత్రంలో జంటగా నటించి ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నారు. తాజాగా మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఫీట్​ అప్​ విత్​ స్టార్స్​' కార్యక్రమానికి హాజరైన ఈ అమ్మడు.. తన భర్త చైతూ గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది.

వ్యక్తిగత విషయంపై సమంతకు ఓ ప్రశ్న వేసింది మంచులక్ష్మి. " పెళ్లికి ముందుకు చై, నువ్వు సహజీవనం చేశారట కదా? నువ్వు సింగిల్​గా ఉన్నప్పుడు, చైతో కలిసి ఉన్నప్పుడు బెడ్‌రూంలో వచ్చిన మార్పులు ఏంటి?" అని సరదాగా అడిగింది.

'ఫీట్​ అప్​ విత్​ స్టార్స్' కార్యక్రమంలో మంచులక్ష్మి, సమంత

ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది అందాల భామ సమంత. "దిండు.. చై మొదటి భార్య. ఒకవేళ నేను అతడ్ని ముద్దుపెట్టుకున్నా, మా ఇద్దరి మధ్య అడ్డంగా ఉండేదదే" అని సమాధానం ఇచ్చింది.

బాధ వెనుక కారణమేంటి..?

ఎప్పుడూ రొమాంటిక్​ స్టిల్స్​తో సోషల్​ మీడియాలో సందడి చేసే సమంత... ఇటీవల ఓ బ్లాక్​ అండ్​ వైట్​ ఫొటోను షేర్​ చేసింది. " ఇలా ఎందుకు ఉన్నానని అడగకండి" అని సందేశం పెట్టింది. తాజాగా మరో ఫొటోను అభిమానులతో పంచుకొని ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించింది.

సమంత షేర్​ చేసిన ఫొటోలు

"జీవితంలోని తీవ్ర గాయాల్ని అప్పుడప్పుడూ పరిశీలించుకుంటేనే.. నీ అంతట నిన్ను గుర్తించుకోగలుగుతావు. అప్పుడే మనశ్శాంతి ఉంటుంది".--సమంత, సినీ నటి

ఈ కామెంట్‌లోని తీవ్రతను, ఫొటోలో కనిపిస్తున్న సామ్‌ లుక్‌ను చూస్తుంటే... ఆమె జీవితంలో ఏదో పెద్ద గాయాన్నే ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఎన్నో ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ... ప్రస్తుతం దక్షిణాది టాప్​ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది.

ఇటీవలే 'ఓ బేబీ' చిత్రంతో హిట్‌ను ఖాతాలో వేసుకున్న సమంత... ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్​ రూపొందిస్తోన్న ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది.

Last Updated : Oct 1, 2019, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details