"నా భర్త చాలా అందంగా ఉన్నాడు" అంటోంది సమంత అక్కినేని. నాగచైతన్య, సమంతలు (బుధవారం) రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల రోకా వేడుకకు హాజరై సందడి చేశారు. సమంత పసుపు రంగులో ఉన్నసల్వార్ కమీజ్ వేసుకొని కనిపించగా.. నాగచైతన్య గళ్ల చొక్కా, ప్యాంటు వేసుకుని దగ్గుబాటి గ్రూప్ ఫోటోల్లో పోజ్ ఇచ్చారు.
తాజాగా సమంత తన భర్త ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ ఫొటోకు..."అమ్మలు, ఆంటీలు, సోదరి, స్నేహితులు అందిరికీ పంపా. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ను వంతు. చూడండి.. మా ఆయన చాలా అందంగా ఉన్నాడు కదూ. (ప్రస్తుతం ఆయన ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నారు)" అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించింది.
ఈ ఫోటోను చూసిన నాగచైతన్య కామెంట్ చేస్తూ.. "ఇది పెయిడ్ పార్టనర్‌షిప్ పోస్ట్.."అంటూ నవ్వుతున్న ఎమోజీని పెట్టారు. ప్రస్తుతం సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్, నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. మొత్తం మీద సమంత, నాగచైతన్యలు చాలా అన్యోన్యంగా ఉంటున్నారని, వారు ఇలానే హాయిగా నవ్వుతూ ఉండాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ భార్యభర్తలు లాక్‌డౌన్‌లో పూర్తి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేస్తున్నారు.
ప్రస్తుతం నాగచైతన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ' చిత్రంలో నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. సమంత 'ఫ్యామిలి మ్యాన్ సీజన్ 2' వెబ్ సిరీస్‌లో కనిపించనుంది.
ఇదీ చూడండి.. తెలుగు చిత్రంలో మలయాళ హీరోతో పూజ!