బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మృతి కేసులో డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తికి బెయిల్ మంజూరైంది. దాదాపు నెలరోజుల తర్వాత బైకుల్లా జైలు నుంచి ఆమె విడుదలైంది.
జైలు నుంచి విడుదలైన రియా చక్రవర్తి - సుశాంత్ డెత్ కేసు
డ్రగ్స్ కేసులో అరెస్టయన బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత బైకుల్లా జైలు నుంచి ఆమె విడుదలైంది.
బైకుల్లా జైలు నుంచి విడుదలైన రియా చక్రవర్తి
గత నెలలో ఎన్సీబీ అధికారులు రియాను అరెస్టుచేసి దర్యాప్తు కొనసాగించారు. అయితే, పలుమార్లు ఆమె బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా.. అవి తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా ఆమెకు బాంబే హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే, రియా సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం నిరాశే ఎదురైంది. నటి రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు తొమ్మిది షరతులు విధించింది.