పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'బద్రి' సినిమా విడుదలై నేటితో 20 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను ఇన్‌స్టాలో పంచుకుంది రేణు దేశాయ్.
"పవన్ ఈ ఫొటోలో అప్పటికి 'ఏయ్ చికితా..' సాంగ్ షూట్ పూర్తి చేసుకొని ఉన్నారు. ఆ తర్వాత విషాదగీతం 'వరమంటే' పాటలో నేను నటించాల్సి ఉంది. ఆ లోకేషన్‌కు చేరుకోవడానికి మేము చాలా దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అలసిపోయి బాగా ఆకలి మీద ఉన్నాం. మేము మారుమూల ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు.. షూటింగ్ మధ్యలో కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేవు. అప్పుడు నేను షార్ట్ స్కర్ట్ ధరించి ఉండటం వల్ల రాయిపై కూర్చోలేకపోయాను. అప్పుడు నేను ఒక అమ్మాయి మీ పక్కన నిలబడి ఉండగా.. మీరు కూర్చోవడం మంచి ప్రవర్తన కాదని కల్యాణ్ గారితో సరదాగా మాట్లాడుతున్నాను. ఆ ప్రాంతం షూటింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండింది. బలమైన గాలులు వీచడం వల్ల నేను నిలబడటానికి, డ్యాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా."