తన సినీ ప్రయాణాన్ని వైవిధ్యభరితంగా ముందుకు తీసుకెళ్తోంది నటి రెజీనా. ప్రయోగాత్మక పాత్రలతో సినీప్రియులను అలరించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల కాలంలో 'ఎవరు', '7', 'చక్ర' లాంటి చిత్రాల్లో ఆమె ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడామె 'బోర్డర్' అనే తమిళ సినిమా కోసం రా ఆఫీసర్‌గా మారింది. అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. అరివళగన్ దర్శకుడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది.
'రా' ఆఫీసర్ అవతారంలో రెజీనా - రెజీనా బోర్డర్ మూవీ
అరుణ్ విజయ్ హీరోగా 'బోర్డర్' అనే చిత్రం తెరకెక్కుతోంది. అరివళగన్ దర్శకుడు. ఇందులో రెజీనా రా ఆఫీసర్‌గా దర్శనమివ్వనుంది. తాజాగా ఆమె లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
రెజీనా
ఇందులో రెజీనా శక్తిమంతమైన రా అధికారికగా దర్శనమివ్వనుంది. తాజాగా చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఆమె రా ఏజెంట్‌గా చేతిలో తుపాకి పట్టుకొని సీరియస్ లుక్‌లో కనిపించింది. విభిన్నమైన స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. స్టెఫీ పటేల్ మరో నాయికగా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.