తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రష్మిక, కార్తి సినిమా విడుదల ఎప్పుడో తెలుసా..? - Actress Rashmika Mandhanna Reveals Release of Debut Tamil Movie in RashmikaReplies 2020

2016లో కన్నడలో 'కిరిక్​ పార్టీ' సినిమాతో తెరంగేట్రం చేసిన నటి రష్మిక మందణ్న... ఇటీవలే చిత్రసీమలో అడుగుపెట్టి మూడేళ్లు పూర్తిచేసుకుంది. తెలుగులో 'ఛలో' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం మహేశ్​బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు'లో నటించింది. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ప్రస్తుతం కాస్త విరామం దొరకడం వల్ల నెటిజన్లతో ముచ్చట్లు పెట్టిన ఈ అందాల భామ... కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

RashmikaReplies
రష్మిక, కార్తీ సినిమా విడుదల ఎప్పుడో తెలుసా..?

By

Published : Jan 4, 2020, 4:48 PM IST

'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులను హాయ్​ అని పలకరిచిన రష్మిక మందణ్న... ఆ తర్వాత గీత గోవిందం, దేవదాస్​, డియర్​ కామ్రేడ్​లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాందించుకుంది. ఇటీవల సినిమా రంగంలో మూడేళ్లు పూర్తిచేసుకుందీ కన్నడ భామ. ఇప్పటివరకు మొత్తం 9 సినిమాలు చేసింది. తర్వలో మహేశ్​ సరసన 'సరిలేరు నీకెవ్వరు' ద్వారా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఖాళీ సమయం దొరకడం వల్ల నెటిజన్లతో ట్విట్టర్​ వేదికగా ముచ్చటించింది.

రష్మిక మందణ్న
సినిమా రంగంలో మూడేళ్లు పూర్తిచేసుకున్న రష్మిక

తమిళంలో తొలి సినిమా...

ప్రముఖ నటుడు కార్తీకి జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది రష్మిక. 'రెమో' ఫేమ్‌ భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. డ్రీమ్‌ వారియర్‌ ఫిక్చర్స్‌ బ్యానర్​పై ఎస్‌.ఆర్‌.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ ఏడాదే సినిమా విడుదల కానున్నట్లు తెలిపింది రష్మిక.

అతడి స్టైల్​ ఇష్టం...

ఇప్పటివరకు కన్నడలో 'కిరిక్​ పార్టీ', 'అంజనీ పుత్ర', 'చమ్మక్​', 'యజమాన'లో నటించింది. అయితే కన్నడ హీరో సుదీప్​ గురించి తాజా చర్చలో ఓ విషయం పంచుకుంది. కిచ్చా స్టైల్​ నచ్చుతుందని చెప్పింది.

వరుస సినిమాలే...

ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. 'భీష్మ','పొగరు', 'సుల్తాన్'​, 'ఏఏ20' సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తోంది.

సరిలేరు నీకెవ్వరులో మహేశ్​,రష్మిక

ABOUT THE AUTHOR

...view details