ఇంట్లో ఎక్కువ సమయం గడిపింది తన జీవితంలోనే ఇది తొలిసారి అంటోంది రష్మిక. చిత్రీకరణలతో బిజీ బిజీగా గడిపే ఈమె, ప్రస్తుతం ఇంట్లో కుటుంబంతో కాలక్షేపం చేస్తోంది. అందం, అల్లరి, సంప్రదాయం... ఇలా అన్నీ కలబోసినట్టు కనిపించే రష్మిక ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు'తో విజయాన్ని సొంతం చేసుకుంది. అవకాశాల పరంగా జోరు మీదున్న ఈ హీరోయిన్ ఎప్పుడెప్పుడు సెట్‌కి వచ్చేద్దామా అని ఎదురు చూస్తోందట. శనివారం అభిమానులతో ట్విట్టర్లో పలు ముచ్చట్లు చెప్పింది.
'సూపర్ ఉమన్'గా మారా..