'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ నటి రష్మిక.. మరోసారి వార్తల్లో నిలిచింది. జనవరి 16న కర్ణాటకలోని ఈ అమ్మడు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వారు లెక్కల్లో చూపని రూ.25 లక్షల సొమ్ముతోపాటు రూ3.94 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
రష్మిక ఖాతాలో భారీ ఆస్తులు.. రూ1.5 కోట్లకు పన్ను ఎగవేత! - rashmika it raids news
కన్నడ భామ రష్మిక ఇంట్లో ఇటీవల ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో దాదాపు రూ. 3.34 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలోని రూ 1.5 కోట్లకు ఈ శాండిల్‌వుడ్ నటి పన్నుఎగవేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అంతేకాకుండా 2016-17 మధ్య కాలంలో రూ.1.5 కోట్లకు రష్మిక పన్ను చెల్లించలేదంటూ తాజాగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇటీవల రష్మిక, ఆమె తండ్రి మదన్ మైసూర్‌లోని ఐటీశాఖ కార్యాలయానికి చేరుకుని పలు డాక్యూమెంట్లను అధికారులకు అందజేశారు.
టాలీవుడ్ హీరో నితిన్, రష్మిక కాంబినేషన్లో 'భీష్మ' సినిమా తెరకెక్కింది. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ప్రముఖ నటుడు కార్తీ సరసన తమిళ సినిమా 'సుల్తాన్'లోనూ నటిస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రానున్న ఓ చిత్రంలోనూ కథానాయికగా ఈ అందాల భామ ఎంపికైంది.