తెలంగాణ

telangana

By

Published : Nov 20, 2020, 4:41 PM IST

ETV Bharat / sitara

నేషనల్ క్రష్​గా నిలిచిన హీరోయిన్ రష్మిక

యువ కథానాయిక రష్మిక.. ఈ ఏడాది నేషనల్ క్రష్​గా నిలిచింది. గూగుల్​లో సెర్చ్​ చేస్తే మీరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. కావాలంటే ఓసారి ప్రయత్నించి చూడండి.

Rashmika Is National Crush Of India This Year
నటి రష్మిక

ఇప్పటివరకు తెలుగు, కన్నడ సినిమాల్లో మాత్రమే నటిస్తున్న హీరోయిన్ రష్మిక.. ఏకంగా 'నేషనల్​ క్రష్ ఆఫ్ ఇండియా'గా మారింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. గూగుల్​లో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2020 అని సెర్చ్ చేయగానే ఈమె పేరు వస్తుండటం విశేషం.

ఈ ఏడాది మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు', నితిన్ 'భీష్మ' సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది రష్మిక. ఆ తర్వాత లాక్​డౌన్ ప్రభావంతో ఇంటికే పరిమితమైందీ భామ. అయితే పై రెండు కాకుండా ఈమె నటించిన మరే సినిమాలు కూడా ఈ సంవత్సరం విడుదల కాలేదు. కానీ రష్మిక నేషనల్ క్రష్​ అయినందుకు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప', కార్తి 'సుల్తాన్' చిత్రాల్లో నటిస్తోంది.

నటి రష్మిక

ABOUT THE AUTHOR

...view details