తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బీచ్ ఒడ్డున హీరోయిన్ రష్మిక వర్కౌట్లు - rashmika latest news

హీరోయిన్ రష్మిక.. సముద్రం ఒడ్డున వ్యాయామం చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.

ACTRESS RASHMIKA BEACH WORKOUT VIDEO
హీరోయిన్ రష్మిక

By

Published : Sep 30, 2020, 3:29 PM IST

అందం, అభినయంతో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయిక రష్మిక. సాధారణంగా సెలబ్రిటీలు జిమ్‌, ఇళ్లలో కసరత్తులు చేస్తుంటారు. లేకపోతే పచ్చని చెట్ల మధ్య వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. నటి రష్మిక సముద్రం ఒడ్డుకు జిమ్‌ పరికరాలు ఎత్తుకెళ్లి.. అక్కడ వర్కౌట్లు చేస్తున్నారు. ఆ వీడియోలు, ఫొటోల్ని అభిమానులతో పంచుకుని, ఆ అనుభూతిని తెలిపింది.

'నా మొదటి బీచ్‌ వర్కౌట్‌.. నిజంగా చెబుతున్నా చాలా అలసిపోయా, కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు సముద్రం ఒడ్డున వ్యాయామం చేయడానికి అలవాటు పడిపోయా. అలల శబ్దం.. సముద్రం సువాసన.. సూర్యోదయాన్ని చూడటం.. నా కాళ్ల కింద ఇసుక.. ఇదంతా చాలా అందంగా ఉంటుంది' అని రష్మిక రాసుకొచ్చింది. ఫాలోవర్స్‌ కోరిక మేరకు వీడియోను షేర్‌ చేసినట్లు పేర్కొంది.

రష్మిక ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. తన మనసు బాలేనప్పుడు ఎక్కువగా కసరత్తులు చేస్తుంటానని ఓ సందర్భంలో చెప్పింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆమె గత కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే షూటింగ్‌ల కోసం ప్రయాణాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం చేసి.. వీడియో షేర్‌ చేశారు. రష్మిక 'సరిలేరు నీకెవ్వరు'తో ఈ ఏడాది ప్రారంభంలో, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం 'పుష్ప'లో నటిస్తుంది. ఇందులోని పాత్రల కోసం బన్నీ, రష్మిక చిత్తూరు యాస నేర్చుకుంటున్నట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details