యాంకర్ రష్మీ 'బొమ్మ బ్లాక్బస్టర్' - రష్మీ జబర్దస్త్
నటి, వ్యాఖ్యాత రష్మీ కథానాయికగా కనిపించనున్న సినిమా 'బొమ్మ బ్లాక్బస్టర్'. మోషన్ పోస్టర్ అభిమానుల్ని అలరిస్తోంది.
![యాంకర్ రష్మీ 'బొమ్మ బ్లాక్బస్టర్' actress rashmi gautham](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8583417-861-8583417-1598543078584.jpg)
యాంకర్ రష్మి గౌతమ్
యాంకర్ రష్మీ హీరోయిన్గా నటిస్తున్న సినిమా బొమ్మ 'బ్లాక్ బస్టర్'. నందు కథానాయకుడిగా కనిపించనున్నారు. మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. విశాఖపట్నం నేపథ్యంలోని కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తుండగా, విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.