'కెరటం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం అగ్రహీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. అయితే తాను పాకెట్ మనీ కోసమే సినిమాల్లోకి వచ్చానని, ఆ తర్వాత ఇండస్ట్రీలోపై అమితమైన ఇష్టంతో ముందుకు సాగానని స్వయంగా వెల్లడించింది. గతంలో 'ఆలీతో సరదాగా' షోకు హాజరైనప్పుడు దీనితో పాటే పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.
'బాహుబలి'లో చిన్నపాత్రైనా చేసేదాన్ని!
చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లతో చేజారిపోయిన అవకాశాల గురించి మనసులో మాట బయటపెట్టింది. అలాంటి ఎదురుదెబ్బలే తనను విజయపథంలో నడిపించాయని చెప్పింది. ఒకవేళ 'బాహుబలి'లో చిన్నపాత్ర ఇచ్చినా సరే చేసి ఉండేదాన్ని తెలిపింది.
బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువే
తన తండ్రి ఉద్యోగరీత్యా భారతదేశం మొత్తం ఎక్కువగా ట్రావెల్ చేశానని రకుల్ తెలిపింది. అందుకే తనకు స్నేహితులు ఎక్కువగా ఉన్నారని చెప్పింది. అందులో బాయ్‌ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారని పేర్కొంది.