కన్నడ చిత్రసీమ డ్రగ్స్ వ్యవహారంలో ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇటీవలే అరెస్టయిన నటి రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల బెయిల్ అభ్యర్థనను శనివారం ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఇద్దరికీ బెయిల్ ఇవ్వడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే విచారణ ఈ నెల 21(సోమవారం)కి వాయిదా వేసింది. దీంతో వీరిద్దరూ మరో రెండు రోజులు జైలులోనే గడపాల్సి ఉంటుంది.
జైల్లోనే సంజన, రాగిణి.. బెయిల్‌పై విచారణ వాయిదా - kannada news updates
శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రాగిణి, సంజనల బెయిల్ అభ్యర్థనను ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబరు 21న తిరిగి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో వీరిద్దరూ మరో రెండు రోజులు కారాగారంలోనే గడపాల్సి ఉంటుంది.
రాగిణి, సంజన
శాండిల్‌వుడ్ డ్రగ్ రాకెట్‌తో సంబంధమున్న ఆరోపణలపై రాగిణి, సంజనలతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేవ్ పార్టీల్లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపారు.
Last Updated : Sep 19, 2020, 2:44 PM IST