తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అహో.. అందాల 'రాశి'.. భువికి దిగిన ఊర్వశి - senior Actress Raasi news

నటిగా తన సినీప్రయాణం సంతృప్తిగా ఉందని అంటోంది సీనియర్​ కథానాయిక రాశి. తన కెరీర్​లో ఎన్నో మంచి పాత్రలను చేశానని చెబుతోంది. నేడు (జూన్​ 29) రాశి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూ.

Actress Raasi Birthday Special Interview
'విభిన్న పాత్రల్లో నటించడమంటే నాకెంతో ఇష్టం'

By

Published : Jun 29, 2020, 8:21 AM IST

Updated : Jun 29, 2020, 9:47 AM IST

"విభిన్న పాత్రలతో మెప్పించడమంటే నాకెంతో ఇష్టం. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషిస్తుంటే నాకే కాదు, చూసే వాళ్లకూ బోర్​గానే ఉంటుంది. అందుకే ఒకసారి చేసిన పాత్రను మళ్లీ చేయకూడదనుకుంటా" అంటోంది సీనియర్​ కథానాయిక రాశి.

రాశి

'మమతల కోవెల' చిత్రంతో బాలనటిగా తెలుగు తెరపై అడుగుపెట్టి.. 'గోకులంలో సీత', 'అమ్మో, ఒకటో తారీఖు', 'పెళ్లి పందిరి', 'ప్రేయసి రావే', 'మనసిచ్చి చూడు', 'దేవుళ్లు' వంటి పలు హిట్​ చిత్రాలతో తెలుగు తెరపై అగ్ర కథానాయికగా మెరిసింది. 'నిజం' సినిమాతో ప్రతినాయికగానూ శభాష్​ అనిపించుకుంది. కొంత కాలంగా వైవిధ్య భరిత పాత్రలతో తన సినీప్రయాణాన్ని కొనసాగిస్తోంది. నేడు (జూన్​ 29) రాశి జన్మదినం సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాల గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

  • "నటిగా ఇన్నేళ్ల సినీ ప్రయాణాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే సంతృప్తిగా అనిపిస్తోంది. ఎన్నో మంచి పాత్రలు చేశా.
  • అందరూ నేను సెకండ్​ ఇన్నింగ్స్​ మొదలు పెట్టా అంటుంటారు. నిజానికి నేనెప్పుడూ నా సినీ ప్రయాణాన్ని ఆపలేదు. పరిస్థితుల్ని బట్టి కాస్త తగ్గించానంతే.
  • పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితంతో బిజీ అయ్యా. నాకు ఎక్కువగా ఇంట్లో గడపడమంటేనే ఇష్టం. అందుకే నాకీ లాక్​డౌన్​ పరిస్థితులు పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ, ఈ కరోనా పరిస్థితుల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపిస్తుంటుంది.
  • నేనొక యూట్యూబ్​ ఛానెల్​ ప్రారంభించా. కాలక్షేపానికి వంటలు, అవీ ఇవీ కొన్ని వీడియోలు అందులో పోస్టు చేస్తుంటా.
  • ఇక మా పాప రితిమా అల్లరితో మరింత కాలక్షేపం దొరుకుతుంది. ఇప్పుడు తను ఫస్ట్​ గ్రేడ్​.
  • మంచి కథ, మనసుకు నచ్చిన పాత్ర ఉన్న చిత్రాల్నే చేస్తున్నా. తెలుగులో రెండు పెద్ద సినిమాలు చేస్తున్నా. త్వరలోనే వాటిపై అధికారిక ప్రకటన వస్తుంది. ప్రస్తుతం తమిళ్​, తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నా. దీంతో పాటు నా భర్త శ్రీరామ్ దర్శకత్వంలో ఓ వెబ్​ సిరీస్​ చేస్తున్నా" అని చెప్పుకొచ్చింది రాశి.

ఇదీ చూడండి... కరోనా ఎఫెక్ట్​: ఆరంభం అదరహో.. తర్వాత బెదరహో

Last Updated : Jun 29, 2020, 9:47 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details