తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గిటార్​ వాయిస్తూ.. ప్రేమ గీతం పాడుతున్న రాశీ ఖన్నా - raashi khanna movie updates

టాలీవుడ్​ హీరోయిన్​ రాశీ ఖన్నా మరోసారి సింగర్​గా అలరించింది. సిద్​ శ్రీరామ్​ ఆలపించిన సూపర్​హిట్​ సాంగ్​ను.. గిటార్​ వాయిస్తూ తనే స్వయంగా పాడిన ఓ వీడియోను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పోస్ట్​ చేసింది.

raashi khanna
రాశీ ఖన్నా

By

Published : Aug 17, 2020, 2:50 PM IST

కరోనాతో లభించిన సుదీర్ఘ విరామం వల్ల సినీ తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే కొంత మంది సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో చిట్​చాట్​ చేస్తుంటే.. ఇంకొందరు తమలోని ప్రతిభను బయటకు తీసి అందరితో ఆహా​ అనిపించుకుంటున్నారు. తాజాగా, టాలీవుడ్​ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా గిటార్​ చేత పట్టి సింగర్​గా మారింది. 'హుషారు' సినిమాలో ఎంతో మంది సంగీత ప్రియులను ఆకట్టుకున్న 'ఉండిపోరాదే' సాడ్​ వెర్షన్​​ పాటను ఆలపించిన వీడియోను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పోస్ట్​ చేసిందీ భామ.

"పాడటం అంటే నాకెంతో ఇష్టం. నా మనసుకు స్వాంతన కలిగించేది ఇదే. తెలుగు పాటల్లో నాకెంతో ఇష్టమైన వాటిల్లో ఇది ఒకటి. ఇందులోని ​సాహిత్యం, ట్యూన్స్​, సిధ్​ శ్రీరామ్​ మధురమైన స్వరం విన్నప్పుడల్లా నా ముఖంలో చిరునవ్వు విరుస్తుంది. ఇప్పుడు నేను పాడాలనుకుంటున్నా. మీతో పంచుకోవాలనిపించింది."

-రాశీ ఖన్నా, సినీ నటి

రాశీ ఖన్నా సింగర్​గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో 'జోరు' సినిమాలో టైటిల్​ సాంగ్​ను ఆలపించి ప్రేక్షకులను మెప్పించింది. మెగా హీరో సాయి తేజ్​ నటించిన 'జవాన్'​ చిత్రంలోనూ 'బంగారు' పాటను పాడింది రాశి.

ABOUT THE AUTHOR

...view details