స్టార్ హీరోయిన్ రాశీఖన్నా కుటుంబంలో పెళ్లిసందడి మొదలైంది. రాశీకి సోదరి వరుసయ్యే కృతి మల్హోత్రా వివాహ వేడుకల్లో రాశీ ఉత్సాహంగా పాల్గొంది. ఇటీవల బ్యాచిలరేట్ పార్టీలో సోదరితో పాటు రాశీ కూడా సందడి చేసింది. బుధవారం పెళ్లికి ముందు జరిగే పూజా కార్యక్రమానికి 'సుప్రీమ్' సుందరి అందంగా ముస్తాబైంది. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
పెళ్లి కోసం 'సుప్రీమ్' భామ ముస్తాబు - రాశీ ఖన్నా సోదరి వివాహం
టాలీవుడ్ కథానాయిక రాశీఖన్నా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆమె కజిన్ కృతి మల్హోత్రా పెళ్లికి ముందు జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాశీ.. అందంగా ముస్తాబైంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
సోదరి పెళ్లికి అందంగా ముస్తాబైన రాశీఖన్నా
'ప్రతిరోజూ పండగే', 'వెంకీమామ' చిత్రాలతో గతేడాది ఆకట్టుకున్న రాశీఖన్నా ఈ ఏడాది ఆరంభంలో 'వరల్డ్ ఫేమస్ లవర్'తో ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ఆమె పోషించిన యామిని పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం రాశీ తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న 'మేధావి', 'తుగ్లక్ దర్బార్' సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.