తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిన్నమ్మయిన హీరోయిన్​ ప్రియాంక చోప్రా..? - villa latest news

గ్లోబల్​స్టార్​ ప్రియాంక చోప్రా ఇప్పుడు చిన్నమ్మ అయ్యింది. అదేంటి విడ్డూరంగా అనుకుంటున్నారా.? తన తోడికోడలు సోఫీ సోమవారం బిడ్డకు జన్మనివ్వడం వల్ల సరికొత్త బాధ్యతలు అందుకుంది ప్రియాంక. నటి సోఫీ టర్నర్‌- గాయకుడు జో జోనాస్‌ 2019లో పెళ్లి చేసుకున్నారు. ఇతడు నిక్​ జొనాస్​కు స్వయానా సోదరుడు.

sofie turner latest news
చిన్నమ్మయిన నటి ప్రియాంక చోప్రా...

By

Published : Jul 29, 2020, 9:43 AM IST

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు సరికొత్త బాధ్యతలు తీసుకుంది! ఈ అందాల భామ ప్రస్తుతం చిన్నమ్మగా మారిపోయింది. తన భర్త నిక్‌ జోనాస్‌ సోదరుడైన జో జోనాస్‌-సోఫీ టర్నర్​లు సోమవారం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. ఆ పాపకు విల్లా అని పేరు పెట్టారు.

బుల్లితెరపై వచ్చిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్' సిరీస్‌లో సన్సా స్టార్క్ పాత్రలో నటించింది సోఫీ టర్నర్‌. సోఫీ-జో జోనాస్‌ అక్టోబర్‌ 2017లో నిశ్చితార్థం చేసుకొని.. అనంతరం 2019లో పెళ్లిపీటలెక్కారు. సోఫీ చివరిసారిగా సైమన్‌ బెర్గ్ దర్శకత్వంలో వచ్చిన 'ఎక్స్ మెన్‌: డార్క్ ఫోనిక్స్' చిత్రంలో జీన్‌ గ్రే పాత్రలో నటించి అలరించింది.

ఇందులో తన భర్త జో జోనాస్‌తో పాటు అతని సోదరులు నిక్‌, కెవిన్‌ జోనాస్‌లు కూడా నటించారు. మొత్తం మీద ప్రియాంక చోప్రా తోడికోడలు అమ్మవ్వడం వల్ల ఇక ప్రియాంక ఎప్పుడు అమ్మౌతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ప్రియాంక-సోఫీ టర్నర్​

ABOUT THE AUTHOR

...view details