ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌తో నటి పూజా కుమార్ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయమై స్పందించిన భామ.. వాటిని కొట్టిపారేసింది. అవి వదంతులు మాత్రమేనని తేల్చింది. తామిద్దరూ మంచి స్నేహితులమని స్పష్టం చేసింది. ఆయన కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపింది.
కమల్‌తో 'బంధం'పై పెదవి విప్పిన నటి పూజా - కమల్ హాసన్ లేటెస్ట్ న్యూస్
విలక్షణ నటుడు కమల్ హాసన్‌తో తనకున్న బంధంపై నటి పూజా కుమార్ స్పందించింది. ఆయన తనకు మంచి స్నేహితుడని తెలిపింది.
కమల్‌తో తనుకున్న బంధాన్ని వెల్లడించిన నటి
అమెరికాలో స్థిరపడిన భారత సంతతి మహిళ పూజా కుమార్.. పలు దక్షిణాది చిత్రాల్లో నటించింది. కమల్ సరసన 'విశ్వరూపం1, 2', 'ఉత్తమ విలన్'తో పాటు టాలీవుడ్లో రాజశేఖర్ నటించిన 'గరుడ వేగ'లోనూ హీరోయిన్గా కనిపించింది.
ఇదీ చూడండి... నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లోని వ్యక్తులకు కరోనా