తారక్‌తో కలిసి స్ర్కీన్ పంచుకోవడం అద్భుతంగా అనిపించిందని హీరోయిన్ పూజాహెగ్డే చెప్పింది. ఈ ఏడాది ఆరంభంలో 'అల వైకుంఠపురములో' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'అరవింద సమేత' సినిమా గురించి, అప్పటి అనుభవాలను పూజ పంచుకుంది.
'మా ఇద్దరి ఎనర్జీ లెవల్స్ కొంచెం ఎక్కువ.. అందుకే' - పూజా హెగ్డే ఎన్టీఆర్
'అరవింద సమేత' షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకున్న నటి పూజా హెగ్డే.. తారక్‌తో కలిసి నటించడాన్ని మర్చిపోలేనని చెప్పింది. త్రివిక్రమ్ వల్లే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం సాధ్యమైందని తెలిపింది.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్-పూజాహెగ్డే మొదటిసారి జంటగా నటించారు. "అరవింద సమేత'.. ఎప్పటికీ నాకు ఓ ప్రత్యేకమైన చిత్రం. ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం ఈ సినిమాతో నాకు లభించింది. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది. మా ఇద్దరికీ ఎనర్జీ లెవల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. దానివల్లే ఆన్‌స్ర్కీన్‌లో మా జోడీ ప్రేక్షకులను అన్నివిధాలుగా అలరించింది. ఆన్‌స్ర్కీనే కాకుండా ఆఫ్‌స్ర్కీన్‌లోనూ ఈ చిత్రం నాకెన్నో అనుభవాలను అందించింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే అరవింద పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నాను' అని పూజాహెగ్డే ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంది.
ప్రభాస్ 'రాధేశ్యామ్'తో పాటు అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లోనూ పూజాహెగ్డే నటిస్తోంది.