బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీని(Payal Rohatagi) అహ్మదాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తాను నివసిస్తున్న హౌసింగ్ సొసైటీలో నివాసితులను బెదిరించిందని సొసైటీ ఛైర్మన్ డాక్టర్ పరాగ్ షా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పాయల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి ఎ.ఎస్.రాయ్ వెల్లడించారు.
ఆ హౌసింగ్ సొసైటీలో ఏడాది కాలంగా తల్లిదండ్రులతో పాటు నటి పాయల్ రోహత్గీ నివాసం ఉంటుంది. అయితే ఆమె కొంతకాలంగా సమీపంలో నివసిస్తున్న పిల్లలను దూషిస్తుందని.. ఛైర్మన్ పరాగ్ షా ఆరోపించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో నటిపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 294-బి, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నటి పాయల్ రోహత్గీని అదుపులోకి తీసుకున్నారు.