'అహ నా పెళ్లంట' సినిమాలోని ఓ సన్నివేశంలో నటులు కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్‌లు ఒంటిపై దుస్తులకు బదులు పేపర్ చుట్టుకుని కనిపిస్తారు. ఆ సీన్ చూసి మనం తెగ నవ్వుకుని ఉంటాం. కానీ ఇప్పుడు అలానే న్యూస్ పేపరు, తలగడ లాంటి వాటిని కాస్ట్యూమ్స్‌గా ధరించి ఆకట్టుకుంటోంది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
తలగడ, పేపర్లు మాత్రమే వాడుతున్న పాయల్ - పాయల్ రాజ్‌పుత్ కొత్త ఫ్యాషన్
'ఆర్ఎక్స్ 100', 'డిస్కోరాజా', 'వెంకీమామ'లతో అలరించిన నటి పాయల్ రాజ్‌పుత్.. లాక్డౌన్ వేళ కొత్త ఫ్యాషన్‌తో అదరగొడుతోంది. తలగడ, పేపర్లను తన కొత్త కాస్ట్యూమ్లుగా ఉపయోగిస్తోంది.

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్
లాక్డౌన్ కారణంగా ప్రసుత్తం ఇంట్లోనే ఉన్న పాయల్.. కొత్త ఫ్యాషన్‌ను ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఇలా సరికొత్తగా కనిపించింది. ఈ ఫొటోలే ఇప్పుడు కుర్రకారును కుదురుగా కూర్చొనివ్వడం లేదు. నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
Last Updated : Apr 23, 2020, 12:23 PM IST