దేశమంతా కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా కొన్ని రోజులుగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. పాత సామెత చెప్పినట్లు మనసు ఊరికే ఉండదు కదా. అందుకే నటి నిధి అగర్వాల్ ఇంట్లో ఉన్నా సరే తను ఇంకా కెమెరా ముందున్నట్లు ఫీలవుతూనే ఉంది. తాజాగా ఈ అందాల నిధి వెబ్ కెమెరా ముందు మేకప్ లేకుండా ఫొటోలకు పోజులిస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి వాటికి తనదైన రీతిలో స్పందిస్తూ.."వెబ్ కామ్ ముందు ఫొటోషూట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కెమెరా నా ముందున్నా ఇది సరైన ప్రదేశం కాదు అనిపిస్తోంది" అంటూ రాసుకొచ్చింది.
నిధి లాక్డౌన్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్ - నిధి అగర్వాల్ న్యూస్
ఎప్పుడూ ఏదో ఒక ఫొటోషూట్‌తో సందడి చేసే హీరోయిన్ నిధి అగర్వాల్. లాక్డౌన్ కారణంగా ఆ వ్యాపకాలకు దూరంగా ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా మేకప్ లేకుండా ఉన్న ఫొటోలను నెట్టింట షేర్ చేసిందీ అందాల భామ.
లాక్‌డౌన్‌లోనూ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్న నిధి
తెలుగులో అక్కినేని హీరోలు.. నాగచైతన్యతో 'సవ్యసాచి', అఖిల్‌తో కలిసి 'మిస్టర్ మజ్ను'లో నటించింది నిధి. ఆ తర్వాత రామ్‌తో కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో తన అందాలతో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగులో అశోక్ గల్లాతో ఓ సినిమా, రవితేజతో కలిసి రమేష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటించనుంది.
ఇదీ చూడండి..'మసకలీ 2.0'పై రెహమాన్ అసంతృప్తి'