'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీగా యువత ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ నభా నటేష్. అందంతో, అభినయంతో పాటు హాట్ ఫోజులతో కుర్రకారు మతులు పోగొట్టేస్తుంది ఈ అమ్మడు. అయితే అందరూ తనని గ్లామర్ గర్ల్గానే ఇష్టపడుతున్నట్లు చెప్పింది.
నటిగా తెరపైకి అడుగుపెట్టామంటే.. అన్ని రకాల పాత్రలు చేసి తీరాల్సిందే అని బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఈ రంగంలో నన్ను నేను నిరూపించుకోవాలంటే నటిగా నాలోని అన్ని కోణాల్ని ఆవిష్కరించాల్సిందే. అందుకే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగానే ఉంటా. కాకపోతే ఏ పాత్ర చేసినా దానికి కథలో తగినంత ప్రాధాన్యం ఉండాలి. నేనైతే వ్యక్తిగతంగా బోల్డ్ బ్యూటీగానే అందరికీ నచ్చుతాననిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టే వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. విజయానికి ప్రత్యేకంగా ఓ రూట్ మ్యాప్ అంటూ ఏం ఉండదు. ముందు మీపై మీకు నమ్మకం ఉండాలి. మీరు కోరుకున్న దాన్ని సాధించగలిగే సహనం ఉండాలి. మీ ప్రతిభపై మీకెంతటి నమ్మకం ఉందో.. అదే నమ్మకాన్ని ఎదుటి వాళ్లలోనూ కలిగించగలగాలి. అప్పుడే పరిశ్రమలో సత్తా చాటగలుగుతారు.