తన తండ్రి, సీనియర్ నటుడు మోహన్‌బాబు మేనరిజమ్‌ను ఇమిటేట్ చేశారు నటి మంచులక్ష్మి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో సరదాగా గడుపుతున్న ఆమె.. ఇటీవల టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టారు. తన కుమార్తె విద్యా నిర్వాణతో కలిసి ఫన్నీ వీడియోలను రూపొందించి అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా తన తండ్రిని ఇమిటేట్ చేస్తూ, ఆయన సినిమాలోని ఓ డైలాగ్‌కు టిక్‌టాక్ చేశారు.
మోహన్‌బాబును అనుకరించిన ఆయన కుమార్తె - మంచు లక్ష్మి తాజా వార్తలు
తన తండ్రి, ప్రముఖ నటుడు మోహన్‌బాబును ఇమిటేట్ చేసి టిక్‌టాక్ చేశారు ఆయన కుమార్తె మంచు లక్ష్మి. అయితే మేనరిజమ్లో నాన్న స్థాయిని అందుకోలేకపోయానని చెప్పారు.
'నిన్న జరిగింది మర్చిపోను. నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపు జరగబోయేదాని గురించి ఆలోచించను' అంటూ మోహన్‌బాబులా హావభావాలను పలికించబోయారు లక్ష్మి. ఈ వీడియోను షేర్ చేసిన ఆమె.. 'నాన్న మేనరిజమ్‌ను ప్రయత్నించాను. కానీ ఆయన స్థాయిని అందుకోలేకపోయా'నని పేర్కొన్నారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మంచులక్ష్మి గత కొంతకాలంగా 'లాక్డ్ అప్ విత్ లక్ష్మి' పేరుతో పలు వీడియోలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యా, ఆరోగ్య, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడి ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇటీవల రానాతో నిర్వహించిన ఇంటర్వ్యూ ఎంతగానో ఆకట్టుకుంది. 2018లో విడుదలైన 'Mrs.సుబ్బలక్ష్మి' వెబ్‌సిరీస్‌లో మంచులక్ష్మి నటించారు.