తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Malavika: ఎక్స్​పోజ్​ చేసినందుకు కోప్పడ్డారు: మాళవిక - ఆలీతో సరదాగా

Malavika: ఓ హిందీ సినిమాలో లిప్​లాక్​లు, ఎక్స్​పోజ్​ చేసినందుకు తన కుటుంబ సభ్యులు చాలా కోప్పడ్డారని చెప్పారు నటి మాళవిక. ఇటీవలే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చిన ఆమె.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Malavika
మాళవిక

By

Published : Feb 1, 2022, 5:57 PM IST

Updated : Feb 1, 2022, 6:33 PM IST

Malavika: తాను నటించిన తొలి తెలుగు చిత్రంలోని రేప్‌ సన్నివేశం మినహా ఆ సినిమాకు పనిచేయటం మంచి అనుభూతినిచ్చిందని మాళవిక అన్నారు. 'చాలా బాగుంది..!'తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. 'దీవించండి', 'శుభకార్యం', 'అప్పారావు డ్రైవింగ్‌ స్కూల్‌' తదితర సినిమాలతో అలరించారు. తెలుగు ప్రేక్షకులకు సుదీర్ఘకాలం దూరంగా ఉన్న ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమం వేదికగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు.

'సీ యు ఎట్‌ 9' అనే హిందీ సినిమాలో ఎక్స్‌పోజ్‌ చేసినందుకు కుటుంబ సభ్యులు తనపై కోప్పడ్డారని, అలా నటించినందుకు తర్వాత బాధపడ్డానని తెలిపారు మాళవిక. 5 తెలుగు చిత్రాలు, 35 తమిళ సినిమాల్లో నటించానని చెప్పారు. బన్‌, సమోస తినేందుకు క్లాస్‌ బంక్‌ కొట్టి క్యాంటీన్‌లోనే ఎక్కువగా ఉండేదాన్నంటూ నవ్వులు కురిపించారు.

మాళవిక

విజయ్ దేవరకొండ అంటే ఇష్టం..

ఒకప్పుడు టాలీవుడ్‌ హీరో నాగార్జున అంటే ఇష్టమని, ఇప్పుడు విజయ్‌ దేవరకొండని తన మనసులో మాట బయటపెట్టారు. నటులు రజనీకాంత్‌, శ్రీకాంత్‌, రాజేంద్ర ప్రసాద్‌తో నటించేటప్పుడు తానెలా ఫీల్‌ అయ్యారో వివరించారు. ఇటీవల.. 'పుష్ప' సినిమాని చూశానని, అందులోని 'ఊ అంటావా' గీతానికి అవకాశం వస్తే తప్పకుండా ఓకే చెప్పేదాన్నని అన్నారు.

'ఉన్నై థేడి' (తమిళం)తో తెరంగేట్రం చేసిన మాళవిక అసలు పేరు శ్వేతా కొన్నూర్‌ మేనన్‌. తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నటించిన మాళవిక.. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన 'చాలా బాగుంది..!'తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. తన అందం, అభినయంతో తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:రెచ్చగొడుతున్న బిగ్​బాస్ బ్యూటీ అందాలు

Last Updated : Feb 1, 2022, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details