తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కొత్త కథలతో ఓటీటీవైపు వెళ్లబోతున్నా' - లక్ష్మి మంచు లాక్డ్​ అప్ కార్యక్రమం

'లాక్డ్​ అప్' కార్యక్రమంతో పలువురు ప్రముఖుల మనోగతాలు తెలుసుకున్న మంచు లక్ష్మి.. త్వరలో ఓటీటీలవైపు వెళ్లబోతున్నట్లు వెల్లడించింది.

'కొత్త కథలతో ఓటీటీవైపు వెళ్లబోతున్నా'
మంచు లక్ష్మి

By

Published : Jun 13, 2020, 7:00 AM IST

ప్రపంచం మొత్తాన్ని కరోనా లాక్‌డౌన్‌ చేస్తే... చాలామంది ప్రముఖులను మంచు లక్ష్మి 'లాక్డ్​ అప్‌' చేసింది. వారి మనోగతాల్ని కదిలించి వారి ఆలోచనలను ఆవిష్కరించింది. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఆ విశేషాలు పంచుకున్నారామె.

నటి-నిర్మాత మంచు లక్ష్మి
  • నాకిది క్వారంటైన్‌లా అనిపించలేదు. ఎలాంటి జాగ్రత్తలు, బాధ్యతలు లేకుండా ఉంటే ఎలా ఉంటానో అలాగే ఉన్నా. వారం తరువాత నాన్న దగ్గరకు వెళ్లాక మళ్లీ క్రమశిక్షణతో జీవించడం మొదలుపెట్టా.
  • ఈ సమయంలో షూటింగ్‌ సెట్‌ను చాలా మిస్‌ అవుతున్నా అనే ఆలోచనలోంచి 'లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మి మంచు' ప్రారంభమైంది. ఇప్పటివరకూ 17మందిని ఇంటర్వ్యూ చేశా.
  • కొన్ని కథలతో ఓటీటీ వేదికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నా. మేం ఇంట్లో కూర్చొలేం. ఏదో సృజనాత్మకంగా చేయాలన్న తపన ఉంటుంది. కెమెరా పట్టుకోమన్న పట్టుకుంటాం. షూటింగ్‌ చేస్తాం. ఒకప్పుడు డబ్బులు పెట్టుకుని థియేటర్లకు వెళ్లి ఎవరు సినిమాలు చూస్తారు. అందరూ నాటకాలు చూస్తారని అనుకున్నారు. టీవీలు వచ్చినప్పుడు థియేటర్ల సంగతి అయిపోయిందన్నారు. అలాగే ఇప్పుడు ఓటీటీలు వచ్చాయి.
  • ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్లమాధ్యమంగా మార్చడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. మాతృభాషే తెలియనప్పుడు మనం ఇంగ్లిష్‌ తీసుకొచ్చి ఏం సాధిస్తాం? మనం తెలుగువాళ్లం. అలాగే ఉండాలి. ఇతర భాషలు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details